సోను సూద్ దేవుడంటూ కితాబు

 సోను సూద్ దేవుడంటూ కితాబు

సోను సూద్ ఎవరికీ ఆపదంటే అక్కడ ప్రత్యేక్షమై వారికీ అండగా ఉండే రియల్ హీరో. ట్విట్టర్ అయిన ఫోన్ కాల్ అయిన మాద్యమం ఏదైనా సరే సమస్య గురించి తనదాక వస్తే ఆ సమస్యను తీర్చేదాకా పట్టు వదలడు.

అలాంటి సోను సూద్ ఏపీ తెలంగాణ వరద బాధితులకు అండగా ఉంటానని మూడు రోజుల కిందట ప్రకటించాడు.. ప్రకటించిన మూడు రోజుల తర్వాత ఈ రోజు ఏపీలో విజయవాడలో బకెట్లు, దుప్పట్లు, చాపలు పంపిణీ  చేశారు సోను సూద్ టీమ్ .

తెలుగు రాష్ట్రాలు తనకు రెండో ఇల్లు అని సోనూ ట్వీట్ చేశారు. ఆహారం, మంచినీరు, మెడికల్ కిట్లు అందించేందుకు తన ఫౌండేషన్ కృషి చేస్తుందని సోనూ మూడు రోజుల క్రితం చెప్పారు . అందులో భాగంగానే నేటి నుంచి సాయం ప్రారంభించారు.దీంతో అందరూ సోను సూద్ దేవుడు.. మాకు సాయంగా దేవుడు వచ్చాడని కితాబు ఇస్తున్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *