ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, శ్రీమతి సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఆసుపత్రిలో చేర్చారు.
ప్రస్తుతం సోనియా గాంధీకి పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తోన్నారు. డెబ్బై ఎనిమిదేండ్ల సోనియా గాంధీ ఇటీవల జరిగిన దివంగత మాజీ ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ అరవై ఒకటి వర్ధంతి సందర్భంగా కన్పించారు.
ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం బాగుంది. రెగ్యూలర్ చెకప్ ల నిమిత్తం ఆమెను ఆసుపత్రిలో చేర్పించినట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రిన్సిపల్ అడ్వైజర్ నరేష్ చౌహాన్ ధృవీకరించారు.
