పవన్ పై శ్రియా కీలక వ్యాఖ్యలు

shriya shocking comments on pavan kalyan
ఏపీ ఉప ముఖ్యమంత్రి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ తెలుగు సీనియర్ నటి శ్రియా చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మహానగరంలో ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ను శ్రియా ప్రారంభించారు.. అనంతరం ఆమె మాట్లాడుతూ ” పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిత్యం ప్రజల గురించి..తనను నమ్ముకున్న వారి గురించే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు.
ప్రజల గురించి ఆలోచించే నాయకుడ్ని ఎన్నుకున్నందుకు ఏపీ ప్రజలు చాలా అదృష్టవంతులు.. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు అద్భుతాలు చేస్తారు. ఆయన ఇంకా ఉన్నత పదవులను అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
పవన్ కళ్యాణ్ తో గతంలో శ్రియా బాలు సినిమాలో ఆడిపాడిన సంగతి తెల్సిందే. ఆ సినిమాలో జరిగిన ఓ సంఘటనను శ్రియా పంచుకుంది. బాలు సినిమా షూటింగ్ సమయంలో పవన్ కు కాలు గాయమైంది. ఆ సినిమా పూర్తిగా షూటింగ్ అయ్యేవరకు ఎవర్కి చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత.. డెడికేషన్ వర్కు పట్ల శ్రద్ధ అలా ఉంటుంది అని ఆమె అన్నారు.
