పవన్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.

 పవన్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.

Shocking news for Pawan fans.

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాన్ అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ హీరోగా, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనూపమ్ కేర్ కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలను ఈనెల ఎనిమిదో తారీఖున ఏపీలోని తిరుపతిలో నిర్వహించాలని చిత్రం యూనిట్ నిర్ణయించింది.

అయితే , తాజాగా ఈ వేడుక వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్వహాకులు ప్రకటించారు. మళ్లీ ప్రీరిలీజ్ వేడుకలను ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే చెబుతామని పేర్కొన్నారు. మరోవైపు, ఈ మూవీ ఈ నెల పన్నెండో తారీఖున విడుదల కానుండగా .. వాయిదా పడే అవకాశాలే మెండుగా ఉన్నాయని ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పమంటున్నాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *