అందమే కాదు గొప్ప మనసున్న ఎంపీ ….?
Shambhavi Choudhary Member of the Lok Sabha
![]()
ఆమె ఎన్డీఏ లో యంగెస్ట్ ఎంపీ… మంచి సేవాగుణం ఉన్న ఎంపీ .. ఆమె బీహార్ రాష్ట్రంలో సమస్తిపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన శాంభవి చౌదరి. తాను ఎంపీ స్థాయికి ఎదగటానికి పడిన కష్టనష్టాల గురించి బాగా గుర్తు పెట్టుకున్నట్లు ఉన్నారు.
అందుకే ఓ మహిళగా సాటి మహిళలకోసం ఏదైన చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ చదువు మానేసిన బాలికలకు సాయం చేయాలని తలపెట్టారు.
అందులో భాగంగా తన ఐదేండ్ల ఎంపీ జీతాన్ని వారికి విరాళంగా ప్రకటించారు. చదువుకుంటేనే సమస్తిపూర్ వృద్ధి చెందుతుంది అనే నినాదంతో ఆమె తన జీతాన్ని ఈవిధంగా ఖర్చు పెట్టనున్నారు.