కోల్ కతా హత్యాచార కేసులో సంచలన తీర్పు..!
దేశంలోనే సంచలనం సృష్టించిన గత ఏడాది ఆగస్ట్ నెల తొమ్మిదో తారీఖున అర్జికర్ అనే వైద్యురాలిపై జరిగిన హత్యాచార కేసులో కోల్ కతా సంచలన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా నిందితుడు సంజయ్ రాయ్ ను మరణించేంత వరకు జైల్లో ఉండాలని సీల్దా కోర్టు తీర్పునిచ్చింది.
అంతేకాకుండా యాబై వేల రూపాయలను జరిమానా కూడా విధించింది. సంజయ్ రాయ్ పై సెక్షన్లు BNS 64,66,103/1 కింద కేసు నమోదు చేశారు.
బాధిత కుటుంబానికి పదిహేడు లక్షలు పరిహారం ఇవ్వాలని కూడా బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఘటన జరిగిన దాదాపు 162రోజుల తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. ఇందులో 120మంది సాక్షులను విచారించింది.