సీతారాం ఏచూరి మృతిపై మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
సీపీఎం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు.. ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి మనకందరికీ తెల్సిందే.. ఆ భౌతికదేయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన కోసం దానం చేశారు. ఇది జరిగి చానా రోజులైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ చింతా మోహాన్ ఏచూరి మృతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు..
ఆయన మాట్లాడుతూ నేను ఒక డాక్టర్ గా చెబుతున్న సీతారాం ఏచూరిది నేచూరల్ డెత్ కాదు.. కేంద్ర ప్రభుత్వం చేయించిన హాత్య అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంత గొప్ప నాయకుడికి.. సీనియర్ నేతకు ఆసుపత్రిలో ఎందుకు ప్రత్యేక గది ఇవ్వలేదు.. సైన్ ఫ్లూ సోకిన వ్యక్తి ఉన్న రూంలో ఏచూరిని ఎందుకు ఉంచారు.. అయిన ఒక డాక్టర్ గా చెబుతున్న నేచూరల్ గా చనిపోయేంత అనారోగ్యం ఏమి లేదు వారికి..
బీజేపీయేతర శక్తులను కూడగట్టగలిగే ఏకైక వ్యక్తి సీతారాం ఏచూరి. ప్రస్తుతం బీజేపీ బలహీన పడుతుంది . కాబట్టి తమకు ఎక్కడ పోటీగా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ని ఏర్పాటు చేస్తారని ఈ దారుణానికి ఒడిగట్టారని వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఏదోక వివాద స్పద వ్యాఖ్యలతో నిత్యం సంచలనం సృష్టించే చింతా మోహాన్ వ్యాఖ్యలపై సీపీఎం ఎలా స్పందిస్తుందో చూడాలి.