దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే పథకం “సన్న బియ్యం”

దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే పథకం, రాష్ట్రంలో నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయడం పేదలకు వరం లాంటిదని ఉద్యమకారుల షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు జాండగూడెం సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్నబియ్యం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ తో కలిసి సన్న బియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రలోనే సన్న బియ్యం పంపిణీ శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో సరిత,మున్సిపల్ కమిషనర్ వీరేందర్,ఎమ్మార్వో రాములు, వైస్ చైర్మన్ డొలి రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి,వైస్ చైర్మన్ బాబర్ ఖాన్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్ ముదిరాజ్,కమ్మరి జనార్దన్ చారి,ఇందూరి శ్రీనివాస్, ఎమ్మె సత్తయ్య,చిలకమర్రి నరసింహ,మాజీ ఉప సర్పంచ్ లు దయానంద్ గుప్తా,దయ్యాల మల్లేష్, యువ నాయకుడు నవీన్ చారి,పెంటయ్య యాదవ్, జగన్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు వన్నాడ శివశంకర్ గౌడ్, విజయ్,ఆంజనేయులు గౌడ్, నరసింహ గౌడ్,పాశం కృష్ణ,బోకుల రాజు,చింత సాయి తేజేశ్వర్,విశాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
