“సంక్రాంతికి వస్తున్నాం” సీక్వెల్ పై క్లారిటీ..!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా .. దిల్ రాజు నిర్మాతగా ఇటీవల సంక్రాంతికి విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఫస్ట్ షో నుండే హిట్ టాక్ తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది ఈ మూవీ.
ఇప్పటివరకు దాదాపు నూట యాబై కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇప్పటికి అన్ని థియోటర్లలో హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వూలో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు దర్శకుడు అనిల్ రావిపూడి సమాధానమిస్తూ ” ఈ కథ రాజమండ్రిలో ఎండ్ అయింది. మళ్లీ అక్కడ నుండి మొదలెడతాం. మళ్లీ సంక్రాంతి పండక్కి వస్తాం అని క్లారిటీచ్చారు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు చెప్పకనే చెప్పారు.