ఓటీటీలోకి సంక్రాంతికి వస్తున్నాం..? ఎప్పుడంటే..?
సీనియర్ స్టార్ హీరో… విక్టరీ వెంకటేష్ హీరోగా… ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా.. నరేష్, సాయికుమార్ లాంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రలో పోషించగా ఇటీవల సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.
సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో పాటలన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి.
సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో నుండే హిట్ టాక్ తెచ్చుకుని విక్టరీ కేరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాదాపు మూడు వందల మూడు కోట్ల రూపాయలను కలెక్ట్ చేసుకుని విక్టరీ కేరీర్ లోనే హయ్యేస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఈ మూవీ రానున్న మహాశివ రాత్రికి కానుకగా ఓటీటీలోకి రాబోతుంది. జీ5(Zee5)లో శివరాత్రి నుండి స్ట్రీమింగ్ కానున్నది.