సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల సునామీ…!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.230 కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు.
వీకెండ్లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. అయితే, తాము ప్రకటించే కలెక్షన్లు కచ్చితమైనవి, ఇవన్నీ ప్రేక్షకుల నవ్వుల నుంచి వచ్చినవని అనిల్ తెలిపారు.