సంజూ రికార్డు..!
 
			                Sanju Samson Records
 
సౌతాఫ్రికా జట్టుతో జరిగిన మొదటి టీ20లో సంజూ శాంసన్ సెంచరీతో ఆదరగొట్టిన సంగతి తెల్సిందే. అంతకుముందు సంజూ హైదరాబాద్ లో బంగాదేశ్ జట్టుతో జరిగిన టీ20లోనూ సైతం సెంచరీ చేశాడు.
దీంతో టీ20ల్లో భారత్ తరపున వరుసగా రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. మొత్తంగా ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.
తొలిమూడు స్థానాల్లో మెకియాన్, రోసోవ్, సాల్ట్ ఉన్నారు. మరోవైపు టీ20ల్లో ఇండియా తరపున రెండు శతకాలను నమోదు చేసిన తొలి వికెట్ కీపర్ కూడా సంజూ నిలవడం విశేషం.
 
                             
                                     
                                    