అక్రమంగా మట్టి తవ్వకాలు పట్టించుకోని అధికారులు

సింగిడి న్యూస్ :మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలంలోని ఇందారం రహదారి సమీపంలో ఓపెన్ కాస్టు మట్టి గుట్టల మధ్య ఉన్నా రామారావు పేటలో కొంతకాలంగా అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు అనుమతుల పేరిట రాత్రి, పగలు లేకుండా ఇష్టారాజ్యంగా జేసీబీ లతో మట్టి తవ్వుతూ మంచిర్యాల సిసిసి నస్పూర్, గోదావరిఖని , ఎన్ టి పి సి ప్రాంతాలకు లారీల ద్వారా మట్టి తరలిస్తున్నారు సుమారుగా రోజుకి 100 నుంచి 150 ట్రిప్పులు చేరవేస్తున్నారు .
ఒక్కొక్క ట్రిప్పుకు గాను 5000 రూపాయలు తీసుకుంటూ అక్రమంగా తరలిస్తున్నారు కాచంపల్లి గ్రామ శివారులోని సుమారుగా 129 ఎకరాల భూమిని సింగరేణి అవసరాలకు ఓబీ అవసరాలకు రైతుల వద్ద రైతులకు ఆ భూమి పరిహారం అందించలేదు భూమి ఎలాగో ఓపెన్ కాస్ట్ లో ముంపుకునకు గురవుతుండగా రైతులకు ధర్నాలకు మట్టిని అమ్ముకొని అక్రమార్కులు మట్టి తవ్వకాలు చేస్తూ రైతులకు ఎంతో కొంత చెల్లించి తవ్వకాలు చేస్తున్నారు దీనికి మైనింగ్ అధికారులు అనుమతి తీసుకున్నప్పటికీ నీబంధనకు విరుద్ధంగా రాత్రి పగలు మట్టి తవ్వకాలు చేస్తున్నారు.
బుధవారం రాత్రిపూట మట్టి తవ్వుతున్న మైనింగ్ ఏఈ గాని డే గాని ఎవరు స్పందించడం లేదు దీనికి ఎన్ని క్యూబిక్ మీటర్లు పర్మిషన్ ఇచ్చారో కూడా తెలియదు ఏమన్నా అంటే మాకు పర్మిషన్స్ ఉన్నాయి అని కనీసం వే బిల్లు కూడా చూపించలేక బెదిరింపులకు దాడులకు పాల్పడుతున్నారు అదేవిధంగా మట్టి జార చేస్తున్న ఏ ఒక్క లారీలకు పర్మిట్ లేకుండా ఇన్సూరెన్స్ ఫిట్నెస్ లేకుండా ఉన్న లారీలతో మట్టి రవాణా చేయడం దీనికి ఆర్టీవో అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా మామూళ్ల మత్తులో చూస్తూ ఊరుకోవడం జరుగుతుంది.
దీనికి వ్యాపారులు రాత్రికి రాత్రే మట్టి తవ్వకాలు నిలిపివేశారు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టడం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులకు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగినది ఈ విషయంపై తాసిల్దారు వనజా రెడ్డి పై వివరణ కోరగా అక్రమంగా మట్టి తవ్వకాలు వాసవేమని అక్కడికి వెళ్లి రెండు జేసీబీ లను స్వాధీనం చేసుకొని మైనింగ్ పోలీస్ శాఖకు అప్పగించడం జరిగినది.
