పట్టాలు తప్పిన సబర్మతీ ఎక్స్ ప్రెస్

Sabarmati Express Accident
1 total views , 1 views today
యూపీలోని వారణాసి- అహ్మదాబాద్ ల మధ్య నడిచే సబర్మతీ ఎక్స్ ప్రెస్ రైలు ఈ రోజు తెల్లారుజామున పట్టాలు తప్పిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు ఇరవై బోగీలు ఈ రైలుకు సంబంధించి ట్రాక్ పై నుండి బయటకు వచ్చాయి. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఏమి కాలేదు.
రైలు పట్టాలపై బండరాయి కారణంగానే రైలు ట్రాక్ నుండి బయటకు వచ్చినట్లు ఆర్ఫీఎఫ్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. సిబ్బంది యుద్ధప్రాతిపదికన రిపేర్ పనులు చేస్తున్నారు.
అయితే గత కొంతకాలంగా పలుమార్లు రైలు ప్రమాద సంఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెల్సిందే. ఇదే అంశం గురించి ఇటు పార్లమెంట్ అటు బయట ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్న ఎలాంటి స్పందన లేకపోవడమే కాకుండా కనీసం చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
