మృతులకు రూ.5లక్షల పరిహారం
ఏపీలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మొత్తం నలుగురు చనిపోయారు. పలు ఇండ్లపై కొండ చరియలు విరిగిపడటంతో పలువురు శిధిలాల్లో చిక్కుకుని ఉన్నారు.
అయితే తొలుత మేఘన అనే యువతి చనిపోగా ఆ తర్వాత మరో 4గురు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోవడం చాలా బాధాకరం ..
వారికి అండగా ఉంటాము. ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.5లక్షల పరిహారం ఇస్తాము. కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలను అధికారులు వెంటనే గుర్తించాలి.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని” ఆయన ఆదేశించారు.