మూవీ చూస్తున్న శ్రేయస్ అయ్యర్ కి రోహిత్ శర్మ ఫోన్- ఆ తర్వాత ఏమైంది..?

 మూవీ చూస్తున్న శ్రేయస్ అయ్యర్ కి రోహిత్ శర్మ ఫోన్- ఆ తర్వాత ఏమైంది..?

Loading

‘‘మ్యాచ్‌కు ముందురోజు రాత్రి ఓ సినిమా చూస్తూ ఉన్నా. ఆ రాత్రంతా అలానే చూస్తూ ఉండాలనుకున్నా. ఎలాగూ ఛాన్స్‌ రాదనే భావన. అప్పుడే కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది. విరాట్ కోహ్లీకి మోకాలిలో వాపు వచ్చింది. నువ్వు మ్యాచ్‌లో ఆడాల్సి ఉంటుందన్నారు. వెంటనే నా రూమ్‌కు వెళ్లి నిద్రపోయా. అందుకే, నాకు ఈ విజయం, ఈ ఇన్నింగ్స్‌ రెండూ గుర్తుండిపోతాయి. విరాట్‌కు గాయం కావడం వల్లే నాకు అవకాశం వచ్చింది.

కానీ, నేను మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగానే ఉన్నా. ఎప్పుడైనా ఛాన్స్‌ వస్తుందని నాకు తెలుసు’’ అని శ్రేయస్ తెలిపాడు.అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ సత్తా చాటాడు. భీకరమైన బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో శ్రేయస్ ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ మోకాలి గాయం వల్ల తుది జట్టు నుంచి వైదొలగడంతో శ్రేయస్‌కు ఛాన్స్ వచ్చింది. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు పెవిలియన్‌కు చేరిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్‌ వైస్‌ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 94 పరుగులు జోడించాడు.

ఈక్రమంలో కేవలం 36 బంతులకే 59 పరుగులు చేశాడు. అయితే, మ్యాచ్‌లో ఆడటంపై ఓ ఫన్నీ స్టోరీ ఉందని అయ్యర్ వెల్లడించాడు.గతంలో నా ప్లేస్‌లో..‘‘ఇలాంటిదే గత ఆసియా కప్‌ సమయంలోనూ చోటుచేసుకుంది. నేను గాయపడటంతో నా ప్లేస్‌లోకి మరొక ప్లేయర్‌ వచ్చాడు. అతడు సెంచరీ సాధించాడు. ఇలా జరగడం ఆటలో సహజమే. నేను గత దేశవాళీ సీజన్‌ మొత్తం ఆడా. అక్కడ చాలా పాఠాలు నేర్చుకున్నా. ఇన్నింగ్స్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలుసుకున్నా. నా వైఖరిని మార్చుకోలేదు. నేను ఆడే విధానం మెరుగుపర్చుకున్నా’’ అని శ్రేయస్ తెలిపాడు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *