రోహిత్ శర్మ అరుదైన రికార్డు..?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించారు. ఐసీసీ నాలుగు ఫార్మాట్లలోనూ జట్టును ఫైనల్ కు చేర్చిన తొలి సారథిగా రోహిత్ శర్మ నిలిచారు.
2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, 2023 వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టును రోహిత్ శర్మ ఫైనల్ కు చేర్చారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ కప్ .. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ చేతిలో ఓడిపోయింది.
మరోవైపు టీ20 వరల్డ్ కప్ లో సౌతాఫ్రికాపై గెలిచింది. తాజాగా దుబాయిలో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ సెమిఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్ కు దూసుకెళ్లింది.
