ఐపీఎల్ లో రోహిత్ శర్మ ప్లాప్..!

Rohit Sharma flopped in IPL..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ముంబయి ఇండియన్స్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు రోహిత్ శర్మనే. అతడే ఆ జట్టుకు మెయిన్ ఫేస్. ఒకప్పుడు నిలకడ ప్రదర్శనతో భారీగా పరుగులు చేస్తూ, జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. కెప్టెన్ గానూ జట్టుకు ఐదు టైటిళ్లు అందించిన ఘనత అతడిది. కానీ ఇప్పుడతడు గత కొన్ని సీజన్లుగా బ్యాటుతో అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఐపీఎల్ 2025 అతడి పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో 0,8 పరుగులు చేసి తీవ్రంగా నిరశపరిచాడు. పైగా ఈ రెండుమ్యాచుల్లో ముంబయి కూడా పరాజయాలను అందుకుంది.
ఈ ఐపీఎల్ లో రోహిత్ శర్మ పేలవ ఫామ్ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మరో మ్యాచులోనూ ప్రభావం చూపలేక పోయాడు. 8పరుగులే చేసి బౌల్డయ్యాడు. అలా గత రెండు మ్యాచుల్లోనూ రోహిత్ విఫల మైన నేపథ్యంలో ముం బయి ఇండియన్స్ తుది జట్టులో అతడి స్థానంపై ప్రశ్నలు మొదలయ్యాయి. రోహిత్ ఇలా పేలవ ప్రదర్శనతో కిందకు పడిపోవడం ఒక్క రాత్రిలో జరిగిందేదీ కాదు. లీగ్లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచినప్పటికీ, గత కొద్ది సీజన్లుగా అతడి ఆట తీరులో స్థిరమైన తగ్గుదల కనిపిస్తోంది. ఐపీఎల్ 2024లో అతడు సెంచరీ చేయడంతో పాటు, గతం కన్నా మెరుగైన స్ట్రైక్ రేట్తో ఆడాడు. కానీ అతడి మొత్తం గణాంకాలు పరిశీలిస్తేనే అస్థిరత కనిపిస్తోంది. గత 14 మ్యాచ్ల్లో అతడు కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు.
ప్లేయింగ్ 11లో అతడికి చోటు కల్పించాలా లేదా జట్టుకు మార్పు అవసరమా అంటూ ఆ ఫ్రాంచైజీ తర్జన భర్జన పడుతోంది. ఇతర బ్యాటర్లు అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న వేళ, రోహిత్ నిలకడలేని ప్రదప్రర్శనతో అతడిని టాప్ ఆర్డర్లో పంపించడం సహా తుది జట్టులో అతడి స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జట్టులో అతడి స్థానం ప్రమాదంలో పడుతుందనే చర్చ కొనసాగుతోంది. పైగా ఇప్పటికే అతడు 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అతడి ఐపీఎల్ భవిష్యత్ పైకూడా కాస్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే మ్యాచ్ల్లో రోహిత్ మెరుగైన ప్రదర్శన చేస్తేనే ఆ తర్వాత మ్యాచుల్లో ముంబయి తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుందనే వ్యాఖ్యలు చోటు చేసుకుంటున్నాయి.
