ఆనందంలో రోహిత్ ఫ్యాన్స్..!

Rohit Sharma
టీమిండియా కెప్టెన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అవుతారని వస్తున్న వార్తలపై హిట్ మ్యాన్ స్పందించిన సంగతి తెల్సిందే. తాను ఫామ్ లో లేకపోవడం.. సిడ్నీ వేదికగా జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ అత్యంత కీలకం కావడంతోనే తాను స్వఛ్చందంగా తప్పుకున్నట్లు తెలిపిన సంగతి తెల్సిందే.
తాను ఇప్పట్లో క్రికెట్ నుండి రిటైర్ కాను అని తేల్చి చెప్పారు. దీంతో హిట్ మ్యాన్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన దగ్గర నుండి ఎన్నో ఊహాగానాలు వ్యాప్తి చెందాయి.
తాజాగా ఆ అనుమానాలన్నింటిని తిప్పికొడుతూ రోహిత్ శర్మ రిప్లయ్ ఇవ్వడంతో ఇటు క్రికెట్ అభిమానులు.. అటు రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
