ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరొకసారి ఢిల్లీకి వెళ్లానున్నారు. నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయల రుణమాఫీ చేసినందుకు పదిలక్షల మందితో కృతఙ్ఞత సభ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఢిల్లీకి రేపు పయనం కానున్నారు.
లక్ష లోపు రుణాలున్న పదకొండు లక్షల యాభై వేల మంది రైతు కుటుంబాలకు సంబంధించి ఏడు వేల కోట్లను వారి ఖాతాల్లో నిన్న సాయంత్రం నాలుగుంటలకు జమ చేసింది ప్రభుత్వం..