హైదరాబాద్ అభివృద్ధిలో కమ్మ వారి పాత్ర అమోఘం
తెలంగాణ రాష్ట్రంలో రాజధాని మహానగరం హైదరాబాద్ ను విశ్వ నగరం చేయడానికి రాష్ట్రంలో ఉన్న కమ్మ వాళ్ళు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
ఈరోజు హెచ్ఐసీసీ లో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిలో కమ్మ వారి పాత్ర కూడా కావాలి..
హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమల్ని ఆహ్వానిస్తుంది.
మీలో ఉన్న నిపుణలను.. మీలో ఉన్న నైపుణ్యాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది “అని అన్నారు…