మయన్మార్లో సహాయక చర్యలు

RMPs and PMPs should not use the word “doctor”.
మయన్మార్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. భారీ భూకంపం ధాటికి మయన్మార్, థాయ్లాండ్లో 700కి మృతుల సంఖ్య పెరిగింది.. భారీ భూకంపాలకు రెండు దేశాల్లో మృత్యుఘోష నెలకొన్నది.. మృతుల సంఖ్య 10 వేలకు పైనే ఉండొచ్చని అమెరికా సంస్థలు అంచనా వేస్తున్నాయి..
మయన్మార్లో ధ్వంసమైన సగాయింగ్ బ్రిడ్జ్.. రెండు దేశాల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నయి.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.. మయన్మార్కు సహాయక బృందాలను రష్యా, చైనా దేశాలు పంపాయి..
మయన్మార్, థాయ్లాండ్లో సహాయక చర్యలకు భారత్ ఆపన్నహస్తం అందించింది.. ప్రధాని మోడీ ఆదేశాలతో మయన్మార్కు 15 టన్నుల సహాయ సామాగ్రిని సైతం పంపారు. మయన్మార్లోని ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ నెలకొన్నది..మొత్తంగా 40కి పైగా భారీ అపార్ట్మెంట్లు నేలమట్టమయ్యాయి.. భవనాల విథిలాల్లో చిక్కుకున్న వందలాది మంది.