రికార్డు స్థాయిలో కంగువా కలెక్షన్లు…!

ప్రముఖ దర్శకుడు శివ, హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కంగువ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణను పొందుతోంది. ఈ నేపథ్యంలో ‘కంగువ’ సక్సెస్ గురించి చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మీడియాతో మాట్లాడుతూ ‘మేము పడిన మూడేళ్ల కష్టానికి ఫలితంగా ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు.
మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకుల టేస్ట్ మరోసారి వెల్లడైంది. ‘తమిళ్’ కంటే తెలుగులో ‘కంగువ’కు కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు సూర్య సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కంగువ’ నిలుస్తుంది.
‘కంగువ-2’ సినిమాలో దీపిక పదుకొనేను హీరోయిన్‌గా తీసుకుంటున్నామనే వార్తలో నిజం లేదు. ఇంకా ఆ మూవీ వర్క్ స్టార్ట్ చేయలేదు. సూర్య చేసిన డిఫరెంట్ రోల్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది’’ అని అన్నారు