RBI కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మనం యూపీఐ నుండి రోజుకి లక్ష రూపాయల వరకు మాత్రమే పంపగలము.. ట్రాన్షక్షన్స్ చేసుకోగలము.. అంతకుమించి పైసా కూడా పంపలేము..
దీని పరిమితిని పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి యూపీఐ ద్వారా ఐదు లక్షల వరకు లావాదేవీలు జరుపుకోవచ్చు అని ప్రకటించింది. అయితే పన్ను చెల్లించేవారు రూ.5లక్షల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లావాదేవీలు చేసుకోవచ్చు అని ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది.
ఇప్పటివరకు కేవలం లక్ష రూపాయల వరకు మాత్రమే యూపీఐ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు.. తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో యూపీఐ వినియోగదారులకు ఎంతో లబ్ధి జరగనున్నది.