అశ్విన్ ఓ ప్రపంచ రికార్డు
టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ శతకం సాధించిన సంగతి విధితమే. దీంతో టీమిండియా 376పరుగులకు సాధించింది.
అయితే 20 సార్లు 50 పరుగుల కంటే ఎక్కువ పరుగులు… 30+ సందర్భాల్లో ఐదు వికెట్లను తీసిన తొలి క్రికెట్ ప్లేయర్ గా రవిచంద్రన్ అశ్విన్ చరిత్రకెక్కాడు.147 ఏండ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఈ ఫీట్ ను సాధించిన అశ్విన్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
అశ్విన్ 101 మ్యాచ్ ల్లో 14 ఆర్ధ శతకాలు… ఆరు శతకాలు… ముప్పై ఆరు సార్లు ఐదు వికెట్లు.. ఎనిమిది సార్లు పది వికెట్లను తీశారు.. బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో అశ్విన్ 113పరుగులు చేశాడు.