ఆ హీరోతో రష్మిక డేటింగ్ ..?

Anticipated Rashmika Mandanna..!
చెన్నై వేదికగా జరిగిన పుష్ప-2 ఈవెంట్ లో పుష్ప హీరోయిన్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
‘మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? అతడిది సినీ ఇండస్ట్రీనా? మరో రంగమా?’ అని యాంకర్ ప్రశ్నించారు. ‘అతను ఎవరో అందరికీ తెలుసు’ అంటూ నేషనల్ క్రష్ సమాధానం ఇవ్వడంతో ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది. అల్లు అర్జున్, శ్రీలీల, దేవిశ్రీప్రసాద్ కూడా పగలబడి నవ్వారు.
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న పుష్ప – 2 మూవీ వచ్చే నెల డిసెంబర్ ఐదో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
