ఏపీ అభివృద్ధి కి నేను సైతమంటున్నా రావు రమేష్
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రికా ఎన్నికలలో ఉండి నియోజకవర్గం నుంచి గెలుపొందిన రఘురామ కృష్ణం రాజు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం Drainage Maintenance Infrastructure Fund, పేరిట ఏర్పాటు చేసిన సంస్థకు రావు రమేష్ రూ. 3 లక్షలు విరాళంగా అందచేశారు.
తన సంపాదనలో కొంత సమాజ సేవకు వినియోగించే రావు రమేష్.. ఆయన చేసే సేవ గురించి బయటకు తెలియనివ్వరు. ఇది ఇండస్ట్రీలో ఆయనకు దగ్గరకు ఉండేవారికి మాత్రమే తెలిసిన విషయం.
ఇప్పుడు కూడా రూ. 3 లక్షలు విరాళం విషయం ఆయన చెప్పలేదు. ఆ విరాళం అందుకున్న ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఒక్కసారి రావు రమేష్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.