బుచ్చిబాబు -రామ్ చరణ్ ల మూవీ పేరు ఖరారు..!

పాన్ ఇండియా స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. ఉప్పెన మూవీతో సంచలనం క్రియేట్ చేసిన నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఓ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానా యిక గా నటిస్తుండగా ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఇదే టైటి ల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలిసింది.
ఈ నెల 27న చెర్రీ బర్త్ డే పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్ ప్రకటన, టీజర్ రిలీజ్ ఉంటాయని సమా చారం. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి. ‘గేమ్ ఛేంజర్’కు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కకపోవడంతో మెగా పవర్ స్టార్ అభిమానులు ఈ చిత్రంపైనే భారీ అంచనాల్ని పెట్టుకున్నారు.
