దేవాలయల్లో వస్త్రధారణపై రకుల్ ప్రీత్ హాట్ కామెంట్స్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన బక్కపలచు భామ.. హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ దేవాలయాల్లో ఉన్న వస్త్రధారణ సంప్రదాయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ల్యాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గోన్న ఈ బ్యూటీ మాట్లాడుతూ ” దేవాలయాలకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ ఆయా సంప్రదాయాలకు అనుగుణంగా వస్త్రధారణను అనుసరించాలి..
హిందూ మత అభిప్రాయాలను.. ఆచారాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి. మనం దేవాలయాలకెళ్లేది మనకు మంచి జరగాలని.. మనస్శాంతి కలగాలని.. ఆ దేవుడ్ని కోరుకోవడానికి వెళ్తాము. అలా వెళ్లినప్పుడు మనలో దైవత్యం ఉట్టిపడే విధంగా మన వ్యవహారించాలి ..
అంతే తప్పా హిందూ మతాభిప్రాయాలు.. ఆచారాలకు భంగం కలిగించే విధంగా ఉండకూడదని ఈ బ్యూటీ తేల్చి చెప్పింది. వివాహా వేడుకలకు వెళ్లినప్పుడు అలా… విందులకు పార్టీలకు వెళ్లేటప్పుడు ఇలా.. మనకు నచ్చినట్లు ఎలా పడితే అలా వెళ్లవచ్చు కానీ దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మాత్రం అక్కడి సంప్రదాయాలను అందరూ పాటించాలని ఈ ముద్దుగుమ్మ సూచిస్తుంది.