ఇంకా కోలుకోని రకుల్ ప్రీత్ సింగ్..!

Rakul Preeth Singh
ఇటీవల జిమ్ చేస్తూ గాయపడిన హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చింది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ గాయం నుండి తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని అన్నారు.
గత ఏడాది చివర్లో వెయిట్ లిఫ్ట్ చేసే క్రమంలో హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ గాయపడ్డారు. తాను చాలా విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ చెప్పారు.
అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ కమిట్ అయిన సినిమాలను తాను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు సినిమాలకు దూరమయ్యారు.