కల్కి మూవీ టికెట్లు బుకింగ్ పై హీరో రాజశేఖర్ స్పందన
పాన్ ఇండియా స్టార్ హీరో..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ..నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుని ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ కల్కి 2898AD . ఈ చిత్రానికి సంబంధించి టికెట్లు బుకింగ్ నిన్న ఆదివారం మొదలైంది.. ప్రారంభమైన గంటల వ్యవధిలోనే నో టికెట్ల బోర్డు కన్పించాయి..
అయితే ‘కల్కి2898AD’కి బదులు తాను నటించి విజయవంతమైన ‘కల్కి’ సినిమాకు టికెట్లు బుక్ అయ్యా యన్న వార్తలపై హీరో రాజశేఖర్ స్పందించారు.
తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ఎక్స్ లో స్పందిస్తూ ‘నాకు అస్సలు సంబంధం లేదు’ అని నవ్వుతున్న ఎమోజీలతో ట్వీట్ చేశారు.
ఈ క్రమంలో హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్, అశ్వినీదత్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రభాస్ కల్కి చరిత్ర సృష్టించాలని రాజశేఖర్ అన్నారు.
మరోవైపు తన తండ్రి రాజశేఖర్ చేసిన ట్వీట్ పై స్పందించిన కూతురు శివాత్మిక.. ‘మా నాన్న! లివింగ్ లెజెండ్’ అంటూ నవ్వుతున్న ఎమోజీలు పెట్టారు.