మాజీ మంత్రి రజని సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపివేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఖండిస్తూ ‘రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఇక లేనట్లేనా?’ అంటూ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..ఆరోగ్య శ్రీ పథకానికి ఆయుష్మాన్ భారత్ రీప్లేస్మెంట్ కాదు..
ప్రజలకు ఆరోగ్య సేవలను విస్తరించేందుకు తీసుకొచ్చిన పథకం అని స్పష్టం చేసిన సంగతి తెల్సిందే.. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి విడదల రజని స్పందిస్తూ”ఆరోగ్యశ్రీపై టీడీపీ ప్రభుత్వ విధానమేంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ‘అప్పుల సాకుతో ఆరోగ్యశ్రీ నుంచి ప్రభుత్వం వైదొలుగుతుందా? అనే భయం ప్రజల్లో నెలకొంది.
కేంద్రమిచ్చే ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని కేంద్రమంత్రి పెమ్మసాని చెబుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మనసులోని మాటలనే ఆయన చెబుతున్నారా? ఆయుష్మాన్ లిమిట్ రూ.5లక్షలే. ఆరోగ్య శ్రీ లిమిటు జగన్ రూ.25 లక్షలకు పెంచారు’ అని ఆమె అన్నారు.