పెళ్లిపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఏఐసీసీ సీనియర్ నేత.. ఆ పార్టీ భవిష్యత్తు ప్రధాన మంత్రి అభ్యర్థి అయిన ఎంపీ రాహుల్ గాంధీకి ఇప్పటికి పెళ్ళి కానీ సంగతి మనకు తెల్సిందే. అయితే ఇప్పటివరకు పలుమార్లు రాహుల్ గాంధీ పెళ్ళి గురించి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో… అటు సోషల్ మీడియాలో సైతం ట్రోల్స్ నడిచాయి.
తాజాగా రాహుల్ గాంధీ తన పెళ్ళి గురించి తప్పనిసరిగా స్పందించాల్సి వచ్చింది. కశ్మీర్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ అక్కడ విద్యార్థినీలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై రాహుల్ గాంధీ ఉన్నది ఉన్నట్లు మనసు విప్పి మాట్లాడారు.
ఈ క్రమంలోనే పెళ్ళి ప్రస్తావన వచ్చింది. దీనికి సమాధానంగా రాహుల్ గాంధీ సమాధానమిస్తూ ” దాదాపు 20-30ఏండ్ల నుండి ఈ ఒత్తిడిని అధిగమించాను. పెళ్ళి విషయంలో ఎలాంటి ప్రణాళికలు లేవు. అలాగని వాటిని తోసిపుచ్చలేము ” అని అన్నారు. ఖచ్చితంగా మీరు పెళ్లి చేసుకోని ఆ పెళ్ళికి తమను అహ్వానించాలని విధ్యార్థినులు రాహుల్ గాంధీని కోరడం విశేషం.