ఎలుకలకు నిలయంగా సర్కారు హాస్టళ్లు..!

తెలంగాణ రాష్ట్రంలో గత పద్నాలుగు నెలలుగా సర్కారు హాస్టళ్లల్లో..గురుకులాల్లో విద్యార్థులను ఎలుకలు కరుస్తున్న సంఘటనలు.. ఆహారం బాగోక ధర్నాలకు దిగిన వార్తలను.. ఆత్మహత్య సంఘటనలను చూస్తూనే ఉన్నాము..
తాజాగా వికారాబాద్ జిల్లా నవాబ్ పెట్ కస్తూర్భా గాంధీ బాలికల ప్రభుత్వ వసతి గృహంలో బాలికలను ఎలుకలు కొరికిన వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..ఈ ఘటనలో మొత్తం 8 మంది బాలికలను ఎలుకలు కొరికాయి..గత నెల 22న నలుగురు బాలికలను ఎలుకలు కొరకాయి..
ఆ తర్వాత హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 27న మరో నలుగురు బాలికలను ఎలకలు కొరికాయి..హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలు ఎలకల దాడికి గురయ్యారు.. సిబ్బంది పట్ల చర్యలు తీసుకోవాలని తల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారు..
