హైదరాబాద్ లో పుష్ప -2 ఈవెంట్ – పోలీసులు కీలక నిర్ణయం..!

 హైదరాబాద్ లో పుష్ప -2 ఈవెంట్ –  పోలీసులు కీలక నిర్ణయం..!

Pushpa-2 event in Hyderabad – Police’s key decision..!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా… నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా హీరోయిన్ గా నటించగా ఈ నెల ఐదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల ముందుకు రానున్న మూవీ పుష్ప -2. ఈ మూవీకి సంబంధించిన పలు ప్రమోషన్స్ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా రేపు డిసెంబర్ రెండో తారీఖున హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ గ్రౌండ్ వేదికగా పుష్ప -2 ఈవెంట్ జరగనున్నది. ఇందుకు గాను పోలీసులు దాదాపు ఆరువందల మందితో భద్రతచర్యలు తీస్కున్నట్లు తెలుస్తుంది.

గతంలో ఇదే మైదానంలో హీరో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో, పుష్ప మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ల సందర్భంగా ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా క్యూఆర్ కోడ్ తో పాసులున్న వారికి మాత్రమే ఈ ఈవెంట్ కు అనుమతి అని తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *