చరిత్ర సృష్టించిన పుష్ప -2

 చరిత్ర సృష్టించిన పుష్ప -2

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా రష్మీక మందన్నా హీరోయిన్ గా. సునీల్ ,రావు రమేష్,జగపతి బాబు,అనసూయ కీలక పాత్రలుగా పోషించగా ఈ నెల నాలుగో తారీఖున పాన్ ఇండియా మూవీగా విడుదలైన చిత్రం పుష్ప 2.

ఈ మూవీ భారత సినీ చరిత్రలో అత్యంత వేగంగా రూ.500కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాగా  రికార్డు సృష్టించింది. మరోవైపు హిందీలో తొలి 2 రోజుల్లో అత్యధిక వసూళ్ల రూపంలో రూ.131కోట్లు ను సాధించి మరికొత్త రికార్డు నెలకొల్పింది.

తొలి 2 రోజుల్లోనే రూ.449cr రాబట్టిన ఈ మూవీ, మూడో రోజు దేశవ్యాప్తంగా రూ.120కోట్ల వరకూ రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. మూడో రోజు సౌత్ (రూ.45cr) కంటే నార్త్ లోనే  (రూ.75cr) ఎక్కువ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *