పుష్ప – 2 మరో రికార్డు..!
ఒకవైపు అల్లు అర్జున్ ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతుంటే దానికి కారణమైన పుష్ప 2 మూవీ రోజుకో రికార్డును సృష్టిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా.. రావు రమేష్, జగపతి బాబు, అనసూయ,సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిగా ఇటీవల విడుదలైన మూవీ పుష్ప 2.
ఈ చిత్రం ఇప్పటికే మొత్తంగా పదిహేడు వందల కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. తాజాగా పుష్ప సీక్వెల్ మరో రికార్డును సొంతం చేసుకుంది. బుక్ మై షోలో అత్యధికంగా టికెట్లను కొనుగోలు చేసిన మూవీగా రికార్డును క్రియెట్ చేసింది.
భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు పద్దెనిమిది మిలియన్లకు పైగా టికెట్లను బుక్ చేశారు. ఇప్పటివరకు ఏ ఇండియన్ మూవీ ఈ రికార్డును సృష్టించలేదు అని సినీ వర్గాలు చెబుతున్నాయి.