నాగబాబుకు ప్రమోషన్..?

జనసేన అధినేత…ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు..ప్రముఖ నటుడైన నాగబాబుకు ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం వస్తాదని అందరూ భావించారు..తాజాగా ఆ వార్తలకు చెక్ పెడుతూ నాగబాబును రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది.
నిన్న మొన్నటి వరకు ఆయన్ను ఎమ్మెల్సీగా ప్రమోట్ చేస్తారు..ఆ తర్వాత మంత్రిగా ఎంపిక చేస్తారనే ప్రచారం బాగా జరిగింది. అయితే ఇప్పుడు ఆయనకు రాజ్యసభసీటు ఇవ్వాలని జనసేన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానంలో కూటమి పార్టీ తరపున నాగబాబును బరిలోకి దించే అవకాశం ఉంది. అటు బీజేపీ కూడా తమ అభ్యర్థిని పోటీ చేయించే అవకాశం ఉందని టాక్.
