సమంత కు అండగా నిర్మాత..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా అల్లుడు శ్రీనులో హీరోయిన్ గా అందాల రాక్షసి..సీనియర్ నటి సమంత నటించిన సంగతి తెల్సిందే..
ఈ చిత్రం నిర్మాణ సమయంలో సమంత చర్మ సంబంధిత అనారోగ్యంతో బాధపడ్డారని ఆ మూవీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘చికిత్సకు సమంతకు అవసరమైన డబ్బులు నిర్మాతలెవరూ ఇవ్వలేదు.
ఆ సమయంలో నేను రూ.25 లక్షలు ఇచ్చాను. ఆమె ప్రైవసీ కోసం సినిమా అయ్యేదాకా స్టార్ హోటల్లో ఉంచాం. 4 నెలలకు కోలుకున్నారు. ఇప్పటికీ ఆ సాయాన్ని ఆమె మరచిపోలేదు’ అని ఆయన పేర్కొన్నారు.