జనసేనానికి ప్రకాష్ రాజ్ కౌంటర్

Prakash Raj Counter To Pawan Kalyan
4 total views , 1 views today
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు విలక్షణ నటుడు.. ఏడు జాతీయ అవార్డుల గ్రహీత ప్రకాష్ రాజ్ మరోసారి కౌంటరిచ్చారు.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఇండియాకు వచ్చిన తర్వాత ప్రతి లైన్ కు సమాధానం చెప్తాను..
అప్పటివరకు నేను చేసిన ట్వీట్ ఆర్ధం చేస్కోమని సలహా ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు ప్రకాష్ రాజ్..లడ్డూ వివాదంలో హీరో కార్తీ పవన్ కళ్యాణ్ సూచనలకు స్పందించి సారీ చెప్పారు. దీనిగురించి నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ” ‘‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో.. జస్ట్ ఆస్కింగ్..’’ అంటూ ట్వీట్ చేశారు.
అయితే లడ్డూ అంశంలో హీరో కార్తీ మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదని ప్రకాష్ రాజ్ అభిప్రాయం.. అందుకే ఎలాంటి తప్పు చేయని కార్తీతో సారీ చెప్పించుకోవడం ఏమి ఆనందమో అని సెటైర్ వేశారని పీకే అభిమానులు ప్రకాష్ రాజ్ ను ట్రోల్స్ చేస్తున్నారు.
