ప్రభాస్ కు గాయం…!
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కు గాయమైంది. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఈ గాయమైనట్లు హీరో ప్రభాస్ వెల్లడించారు.
జపాన్ లో వచ్చే నెల మూడో తారీఖున విడుదలవ్వనున్న కల్కి ప్రమోషన్లకు తాను హాజరు కావడం లేదు. షూటింగ్ లో తగిలిన గాయంలో తన చీలమండ బెనికింది. అందుకే వెళ్లలేకపోతున్నాను స్వయంగా హీరో ప్రభాస్ ప్రకటించాడు.
డిస్ట్రిబ్యూటర్ల టీమ్ ప్రమోషన్ల కార్యక్రమంలో పాల్గోంటుందని తెలిపారు. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.