పోసాని కృష్ణమురళి కి వైద్య పరీక్షలు..!

posani KrishnaMurali at Hospital
ప్రముఖ నటుడు నిర్మాత దర్శకుడు.. వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఆంధ్రా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయుడుల గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంతో కడప పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజాగా పోసాని కృష్ణమురళికి కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలో పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలను డాక్టర్లు చేశారు. కడప జిల్లాలోని రాజంపేట ప్రభుత్వాస్పత్రి, కడప రిమ్స్‌లో టెస్ట్‌లు చేశారు. ఈ పరీక్షల్లో పోసానికి సంబంధించిన అన్ని రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని డాక్టర్లు తెలిపారు.
ఈ సందర్భంగా రైల్వేకోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అరెస్ట్ నేపథ్యంలో పోసాని ఉదయం నుంచి నాటకం ఆడారు.పోసాని కడుపులో నొప్పి అంటే ఆస్పత్రికి తరలించాము.రాజంపేట, కడపలో పోసానికి టెస్ట్‌లు చేయించాము.పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించాము.పోసానికి ఎలాంటి సమస్యలు లేవని తేలింది అని చెప్పారు.
