బాబు తీరుతో జగన్ కు బూస్టింగ్
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ప్లస్ అవుతుందా…?. వరదలతో ఇబ్బందుల పాలైన బాధితులకు అండగా ఉండకుండా బురద రాజకీయం చేస్తున్న చంద్రబాబు & టీమ్ వ్యవహారం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకోస్తుందా..?. కష్టాల్లో అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే చేతులు ఎత్తేయడం వైసీపీకి వరంగా మారుతుందా..?. ఇప్పుడు చూద్దాం..!
వరదలతో ఆగమాగమైన విజయవాడను చక్కదిద్దడానికి.. తీవ్రంగా నష్టపోయిన బాధితులకు భరోసానివ్వడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు & టీమ్ తెగ కష్టపడుతుంది… ఆ కష్టాన్ని యావత్ ఏపీతో సహా దేశమే చూస్తుంది. ఇందులో ఎవరూ కూటమి ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి ఏమి లేదు. ఎందుకంటే ప్రకృతి వైపరిత్యాలు చెప్పి రావు..
అవి వచ్చినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఎలా వ్యవహరించిందనేదే ప్రజల్లో నెగిటీవ్.. ఫీడ్ బ్యాక్ కు కారణమవుతుంది. అయితే చంద్రబాబు ఇక్కడ చేస్తున్న తప్పు ” వరదల్లో ఉంటే ప్రతిపక్ష నేతలు రావడం లేదు.. జగన్ పరామర్శించడం లేదు.. ప్రకాశం బ్యారేజ్ గేట్లను కూల్చడానికి జగన్ కుట్రలు చేస్తున్నారు..
తనను ఓడించిన ప్రజలపై కక్ష తీర్చుకోవడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నాడు. గత ప్రభుత్వాల వైఫల్యాల వల్లనే ఈ వరదలు.. పదిలక్షల కోట్ల అప్పు చేసింది గత ప్రభుత్వం.. ఇప్పుడు వాటి అప్పుకు కట్టాల్సిన వడ్డీలకే ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం సరిపోవడంలేదు. నాదగ్గర పైసలు లేవు.. ఖజనా ఖాళీ అయింది. అందుకే బాధితులకు పదివేలు మాత్రమే సాయం చేయగలుగుతున్నాను అని నిర్లక్ష్యపు.. బాధితులను నిరాశకు గురై విధంగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చేలా చేస్తున్నాయ్..
ఓట్లేసి గెలిపించిన కూటమి ప్రభుత్వం తమకు సాయం చేయకపోతే ప్రతిపక్ష పార్టీ వైపు మళ్లుతారు.. ప్రతిపక్ష పార్టీ ఇక్కడ రెండో ప్రాధాన్యం అన్నట్లు.. అంటే ప్రజలు కష్టాల్లో ఉంటే అధికారంలో ఉన్న పార్టీ ఏమి చేయాలో అది చేతల్లో చేసి చూపించాలి . కానీ అధికారంలోకి వచ్చాక కూడా ప్రతిపక్ష వైసీపీ గురించి.. జగన్ గురించి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడి దగ్గర నుండి కేంద్ర మంత్రి వరకు అందరూ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెడుతున్నాయి..
వరదలతో నష్టపోయిన మాకు ఏదైన సాయం చేసి అండగా ఉండమంటే అధికారంలో లేకముందు అదే పాట… అధికారంలోకి వచ్చాక అదే పాట పాడుతున్నారా అని ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వ నాయకుడిపై తీవ్ర అసహానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మెల్లమెల్లగా వస్తుంది అన్నమాట. ఉన్నమాట .