మళ్లీ తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు..!

ఏపీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.
మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్, ఓ మీడియా సంస్థ అధినేత అయిన శ్రవణ్ కుమార్ లకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్లు అధికారులు ప్రకటించారు.
దీనిపై సీబీఐ నుండి రాష్ట్ర సీఐడీ అధికారులకు సమాచారం వచ్చింది. వీరిద్దర్ని వీలైనంత త్వరగా మన దేశానికి .. రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కేంద్ర హోం శాఖ, విదేశాంగ శాఖ అధికారులతో రాష్ట్ర పోలీసు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
