అన్నచెల్లెల పంచాయితీలోకి పవన్ ఎంట్రీ..?
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న సంగతి తెల్సిందే..తాజాగా ఈ వివాదంలో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీచ్చారు. పంచాయితీ రాజ్, అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ జగన్ కు చెందిన సరస్వతి పవర్ కంపెనీ ఆస్తులకు సంబంధించిన భూములపై ఆరా తీయమని సంబంధితాధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తుంది.
పల్నాడు జిల్లా దాచేపల్లి,మాచవరం మండలంలో ఈ కంపెనీకి అప్పటి ఉమ్మడి ఏపీలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మే 18,2009లో దాదాపు 1,515.93 ఎకరాలను కేటాయించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చాక టీడీపీ సదరు కంపెనీకి ఉన్న సున్నపురాయి లీజులను రద్ధు చేసింది. మళ్లీ అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించుకుంది. అయితే ఆ భూములు అటవీ శాఖకు సంబంధించినవా అని ఆ శాఖ అధికారులను పవ పురమయించారు.
అయితే నిజంగా ఆ కంపెనీకి చెందిన భూములు అటవీ శాఖకు చెందినవి అయితే ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అగుతారా..?. పోనీ రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అప్పుడు కేవలం లీజును రద్ధు చేశారే తప్పా ఆ భూముల జోలికెళ్లలేదు. అంటే అవి సక్రమైనవే కదా అని అధికారుల ఉవాచ. మరి పవన్ ఎందుకు అనవసరంగా ఈ ఇష్యూలో వ్రేలు పెట్టారో మున్ముందు తెలుస్తుంది అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.