పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం
ఏపీ డిప్యూటీ సీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈరోజు సోమవారం పిఠాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు…
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లేదని అన్నారు. మాట్లాడుతూ.. ‘జీతం తీసుకుని పనిచేద్దాం అనుకున్నాను.
కానీ శాఖలో డబ్బులు లేకపోవడం, వేల కోట్ల అప్పులు చూసి ఎమ్మెల్యేగా జీతం వద్దని చెప్పాను. క్యాంప్ ఆఫీసులో మరమ్మత్తులో ఏమైనా చేయాలా అని అడిగితే వద్దన్నాను. కొత్త ఫర్నీచర్ కొనొద్దు.. నేను తెచ్చుకుంటాను అని చెప్పాను’ అని ఆయన పేర్కొన్నారు.