ప్రపంచంలో రెండో వ్యక్తిగా పవన్ కళ్యాణ్..!
ఏపీ డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా గూగుల్ అత్యధికంగా శోధించిన రెండవ నటుడిగా అవతరించారు.
2024లో ఎక్కువగా సెర్చ్ చేసిన నటుల జాబితాను సంస్థ విడుదల చేసింది. ఇందులో హాస్యనటుడు కాట్ విలియమ్స్ అగ్రస్థానంలో నిలిచారు.
నటుడిగా, రాజకీయ వేత్తగా ఈ ఏడాది పవన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలవడంతో ఆయన గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేశారు. ఈ జాబితాలో భారత్ నుంచి హీనా ఖాన్, నిమ్రత్ కౌర్ కూడా ఉండటం విశేషం.