అభిమానులకు పవన్ చురక
ఏపీ డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న శుక్రవారం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో దీపం-2 పథకం ప్రారంభోత్సవంలో పాల్గోన్నారు..
ఈ సందర్భంగా ప్రసంగిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎవరూ ఊహించని అనుభవం ఎదురైంది. వేదికపై ఆయన ప్రసంగిస్తుండగా అభిమానులు ‘ఓజీ.. ఓజీ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో స్పందించిన పవన్ ‘సినిమాలు సరదా కోసమే.
అవే జీవితం కాదు. అందరూ భగవంతుని నామస్మరణ చేస్తే అద్భుతాలు జరుగుతాయి. మన జీవితాలు కూడా బాగుపడతాయి’ అని ఆయన పేర్కొంటూ అభిమానులకు చురకనంటించారు.