భారత్ కు పాక్ కౌంటర్..!

Khawaja Muhammad Asif
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఇటీవల పాకిస్థాన్ దేశంలోని ఉగ్రవాద స్థావరాలపై, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద కార్యాకలపాల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ బలగాలు ఆపరేష సిందూర్ పేరుతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆపరేషన్ సిందూర్ గురించి నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన ప్రకటన కూడా చేశారు.
ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ” ఆపరేష సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ కు చెందిన ఎఫ్ – 16తో సహా ఐదు ఫైటర్ జెట్లు, ఓ విమానాన్ని కూల్చివేశామని” ఆయన ప్రకటించారు. ఎస్ -400ను ఉపయోగించి వాటిని ధ్వంసం చేసినట్లు ఆయన చెప్పారు. పాకిస్థాన్ లోని రెండు వైమానిక స్థావరాలనూ నాశనం చేసినట్లు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా పాక్ ఏదో చేస్తోందని ముందుగా పసిగట్టామని, ఆపరేషన్ సిందూర్ తో దాయాదికి స్పష్టమైన సందేశాన్ని పంపించామని ఆయన తెలిపారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వెల్లడించిన విషయాల గురించి పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసుఫ్ ఖండించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ” ఒక్క పాక్ విమానాన్ని ఇండియా కూల్చలేదు. మూడు నెలల నుంచి వారేం మాట్లాడలేదు. కానీ మేము ఇంటర్నేషనల్ మీడియాకు అన్నీ వివరించాం. ఒకవేళ నమ్మకం లేకుంటే దీనిపై స్వతంత్ర విచారణ జరిపించాలి. అయినా భారత్ నిజాన్ని బయటకి రానివ్వదు’ అని ఆయన కౌంటర్ ఇచ్చారు.