పవన్ తిరుమల పర్యటనలో ఓవరాక్షన్..?
ఏపీ డిప్యూటీ సీఎం… జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఏమి చేసిన కానీ దానిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ తెగ నడుస్తున్నాయి.. ఇటీవల విజయవాడ వరద బాధితులను ఎందుకు పరామర్శించలేదంటే బాధితులకు అందే సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతుంది.. ప్రాణ నష్టం జరగకూడదని వెళ్లలేదు అని పవన్ రిప్లయ్ ఇచ్చారు. ఆ తెల్లారే పిఠాపురం నెల్లూరు వరద బాధితులను పరామర్శించడానికెళ్లారు.. ఆ పర్యటనలో జనాల నుండి ఎక్కువగా స్పందన రాలేదు.. రాకపోగ భద్రత సిబ్బంది, అధికార యంత్రాంగం, జనసైనికుల హాడావుడి తప్పా ఏమి లేదు.. దీనిపైన ఎంతగా ట్రోల్స్ జరిగాయో మనం గమనించాము.
ఆ తర్వాత నిన్న కాక మొన్న కార్తీ లడ్డూ ఇష్యూ చాలా సెన్సిటీవ్.. దానిపై కామెంట్ వద్దు అని అంటే పవన్ అంత ఎత్తున ఎగరడం.. పూనమ్ కౌర్ నుండి నెటిజన్లు, మేధావులు, ప్రకాష్ రాజ్ వరకు అందరూ పవన్ ను సోషల్ మీడియాలో ఏకిపారేశారు.. తాజాగా ప్రకాష్ రాజ్ సైతం ఇక ఆపు.. ప్రజలకు కావాల్సింది చేయమని సలహా ఇస్తూ ట్వీట్ చేశారు.ఇంకా ఆ మంట చల్లారకుండానే తాజాగా పవన్ తిరుమల పర్యటనపై సోషల్ మీడియాలో ఇటు ప్రతిపక్ష పార్టీకు చెందిన కార్యకర్తలు,నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకోవడం ఎవరూ తప్పు పట్టరు. కానీ జగన్ చేసిన అపచారం దేవుడు మన్నించాలనే పాదయాత్రగా వెళ్తున్నాను అని ప్రకటించడంపైనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జనసేనాని తిరుమల ఘాటుకు చేరుకుంటారని గంటకు ముందే ఎక్కడక్కడ ట్రాఫిక్ ను ఆపేసి పవన్ కళ్యాణ్ కు దారి క్లియర్ చేశారు. డిప్యూటీ సీఎం స్థాయి నాయకుడు వచ్చేముందు ప్రోటోకాల్ ప్రకారం చేస్తే ఎవరూ తప్పు పట్టడం లేదు. కానీ మెట్లపై పవన్ వ్యక్తిగత భద్రత సిబ్బంది, మిగతా సిబ్బంది వల్ల సాటి భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని సోషల్ మీడియాలో మీమ్స్ ,ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో ఎంతో మంది వీఐపీలు వచ్చిన భక్తులకు కలగని ఇబ్బంది పవన్ రాకతో ఎక్కువగా కలుగుతుందని వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏంటో పవన్ ఈ మధ్య ఏమి చేసిన కానీ సోషల్ మీడియాలో ట్రోల్స్ రూపంలో ట్రెండింగ్ లో నిలుస్తున్నారు.